జైశ్రీరామ్.
శ్లో. వృద్ధకాలే మృతా భార్యా బంధుహస్తే గతం ధనంభోజనం చ పరాధీనం తిస్రః పుంసాం విడంబనాః.
గీ. వృద్ధ వయసున నర్థాంగి విడిచి చనుట,
ధనము బంధుల పాలయి తల్లడిలుట,
భోజనార్థమన్యులపంచ ముదిమి నుంట,
మనుజునకు దుఃఖ హేతువుల్ మాన్యులార!
భావము. ముసలితనములో భార్య మరణించుట , ధనమంతయు బంధువుల వశమగుట, భోజనమునకై ఇతరులపై ఆధారపడుట అనే మూడూ మానవులకు దుఃఖహేతువులు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.