జైశ్రీరామ్.
శ్లో. దోషభీతే రనారంభః త త్కాపురుష లక్షణంకిమజీర్ణ భయాద్భ్రత ! భోజనం పరిహీయతే?
గీ. దోష భీతిచే పని చేయ తోపకునికి
దుష్ట దుర్మార్గ వర్తన. దోష మరయ.
తిన నజీర్ణ దుర్భయమొంది తిండిమాను
జనులు భువి నుందురా కన? సదయులార.
భావము. ఏదైనా దోషం జరుగుతుందేమో అనే భయంతో ఏ పనినీ ప్రారంభించకపోవటం దుష్టుని లక్షణం. అజీర్ణం చేస్తుందేమో అనే భయంతో ఎవడైనా భోజనం మానుకుంటాడా?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.