జైశ్రీరామ్.
శ్లో. ఆదౌ చిత్తే తతఃకాయే సతాం సంపద్యతే జరాఅసంతాతు పునః కాయే నైవ చిత్తే కదాచ న.
గీ. సుజన పాళికి వార్ధక్య శోభ మదికి
చిన్నతనమునె వచ్చును మన్ననముగ.
వరసు చేతనె పాపికి వచ్చు ముదిమి.
జ్ఞానమున రాదు వృద్ధత, కానరేల?
భావము. సజ్జనులకు ముందుగా మనస్సులోను, ఆ తరువాత శరీరమునందును వార్ధక్యం వస్తుంది. దుర్జనులకు మాత్రం శరీరంలో వార్ధక్యం వస్తుందేగానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యంరాదు. (పెద్దరికం రాదు).
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.