జైశ్రీరామ్.
శ్లో. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాఃస గరుః దుర్లభో యస్తు ,శిష్య హృత్తాపహారకః.
గీ. శిష్య విత్తాపహారులై చెలగునట్టి
గురువులుందరనేకులు, కూర్మిఁ జేరు
శిష్య హృదయార్తి తొలగించి చెలగునట్టి
గురువులరుదుగనుందురు నిరుపమముగ.
భావము. శిష్యుల ధనమును కాజేయు గురువులు ఎందరో ఉన్నారు. కానీ, వారి హృదయార్తిని తొలగించు గురువు దుర్లభుడు కదా.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.