జైశ్రీరామ్.
శ్లో. సతాం ధనం సాధుభి రేవ భుజ్యతేదురాత్మభి ర్దుశ్చరితాత్మనాం ధనం
ఆ. శుకాదయ శ్చూతఫలాని భుంజతే
భవంతి నింబాః ఖలు కాక భోజనాః.
మంచి వారి ధనము మంచి వారికి చెందు,
చెడ్డ వారి ధనము చెడుగుఁ జెందు.
ఆమ్రఫలము చిలుక లారగించుచునుండు.
కాకి వేప పండ్లె గతుకుచుండు.
భావము. సజ్జనుల సంపద సజ్జనులకే భుక్తమౌతుంది. దుర్జనుల సంపద దుర్జనులకే లభిస్తుంది. మామిడి పండ్లను చిలుకలు, వేప పండ్లను కాకులు భుజిస్తాయికదా!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.