జైశ్రీరామ్.
శ్లో. వృత్తం యత్నేన సంరక్ష్యం విత్తమేతి చ యాతి చఅక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః.
క. ధనమును బ్రోచుట కంటెను
గుణమును బ్రోచుటయె మిన్న, గుణ ధనములలో
ధన హీనమే ప్రశస్తము
గుణ హీనముకన్న తెలియగానగు మనకున్.
భావము. ధనాన్ని కంటే ఎక్కువగా సత్ప్రవర్తనను ప్రయత్న పూర్వకంగా సంరక్షించుకోవాలి. ధనం వస్తూ, పోతూఉంటుంది. ధనం క్షీణించినవానికంటే మంచి నడవడికను కోల్పోయినవాడే చెడిన వాడనిపించుకుంటాడు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.