జైశ్రీరామ్.
శ్లో. ధృతిః క్షమా దమోஉస్తేయం శౌచమింద్రియనిగ్రహఃధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్.
గీ. ధైర్యమోర్పును నిష్టయు, తరళ విద్య,
సత్యమును, దొంగ కాకుంట, సద్గుణంబు,
కోపహీనతేంద్రియజయ గుణము మరియు
శౌచమనుపది ధర్మలక్షణములరయ.
భావము. ధైర్యము,ఓర్పు, నిష్ఠ, దొంగతనము చేయకుండుట, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, సద్బుద్ధి, విద్య, సత్యము, కోపరాహిత్యము - ఈ పది ధర్మలక్షణాలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ధర్మ లక్షణములను చక్కగా వివరించారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.