జైశ్రీరామ్.
శ్లో. యేనాస్య పితరో యాతాః,యేన యాతాః పితామహాఃతేన యాయా త్సతాం మార్గం , తేన గచ్ఛన్నరిష్యతే.
గీ. సుజనులౌ తల్లిదండ్రులు చూపు త్రోవ
విడువబోకుండ నడచిన ప్రీతితోడ
హానిఁ గొలుపదదెన్నడు, హాయి గొలుపు.
మంచి మార్గంబు మనకద్ది మాన్యులార!
భావము. ఏమార్గములో తమ తండ్రులు, తాతలు వెళ్ళారో , ఆ సన్మార్గాన్నే అనుసరించిన వారికి ఏ హాని జరుగదు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.