జైశ్రీరామ్.
శ్లో. అర్థేన కిం కృపణహస్త గతేన తేన ?రూపేణ కిం గుణ పరాక్రమ వర్జితేన ?
జ్ఞానేన కిం బహుజనైః కృత మత్సరేణ?
మిత్రేణ కిం వ్యసనకాల పరాఙ్ముఖేన ?
గీ. లోభియైనట్టి ధనికుచే లాభమేమి?
సుగుణ, ధైర్య విహీనుని శోభ యేల?
కలిత విద్వేష పూర్ణుని జ్ఞానమేల?
సమయమప్పుడు నిలువని సఖ్యుఁ డేల?
భావము. లోభి చేతిలో ఉన్న ధనం వల్ల ఏమి ప్రయోజనం ? సద్గుణము, పరాక్రమము లేని వాని అందము వల్ల ఏమి ప్రయోజనం ? ఎందరియందో ద్వేషం పెంచుకొనే వాని జ్ఞానం వల్ల ఏమి ప్రయోజనం ?ఆపద సమయంలో ముఖం చాటుచేసే స్నేహితుని వల్ల ఏమి ప్రయోజనం ?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.