జైశ్రీరామ్.
శ్లో. అవ్యాకరణమధీతం , భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణంభేషజమపథ్య సహితం త్రయమిదమకృతం వరం న కృతమ్.
గీ. పూర్ణ విద్యను నేర్వమిన్ పోకు చదువ.
భిన్నమైనట్టి పడవలో వెళ్ళఁ బోకు.
పత్యమును చేయ లేనిచో వలదు మందు.
పూర్ణ మనమున పని చేయఁ బూన వలయు.
భావము. వ్యాకరణాన్నిసమగ్రంగా చదవకపోవటం, పగిలిన పడవతో నదిని దాటాలనుకోవటం, పథ్యం లేకుండా ఔషధాన్ని సేవించాలనుకోవటం అనే మూడు పనులకు అసలు సిద్ధపడకపోవటమే మంచిది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.