జైశ్రీరామ్.
శ్లో. అరావప్యుచితంకార్యం ఆతిథ్యం గృహమాగతే ఛేత్తుం పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే ద్రుమః.
గీ. అతిథిదేవుఁడు పాత్రుడై యలరు చున్న
శతృవైనను మన్నించి చక్క గనుము.
నరకవచ్చిన వానిపైకరుణ జూపి
నీడ నిచ్చునువృక్షము నిరుపమముగ.
భావము. ఇంటికి శత్రువు వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలి. తనను నరకటానికి వచ్చిన వానికి కూడా చెట్టు తన నీడను ఉపసంహరించుకోవటంలేదు కదా.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.