జైశ్రీరామ్.
శ్లో. యేషాం తపశ్శ్రీ రనఘా శరీరే, వివేచికా చేతసి తత్త్వ బుద్ధిః
సరస్వతీ తిష్ఠతి వక్త్ర పద్మే
పునంతు తే உ ధ్యాపకపుంగవా నః.
గీ. ఘన తపశ్శోభ దేహాన కలుగు ఘనుఁడు,
ధరణి సంపూర్ణ సువివేక తత్వ వ్వేత్త,
వాణివశియించు ముఖపద్మభాగ్యశాలి,
గురువు పదమున కర్హుఁడు ధరణిపైన.
భావము. ఎవరి శరీరమునందు నిర్మలమైన తపశ్శోభ ఉంటుందో, ఎవరి మనస్సులో వివేచనతో కూడిన తత్త్వ బుద్ధి ఉంటుందో, ఎవరి ముఖ పద్మమునందు సరస్వతీదేవి కొలువై ఉంటుందో అట్టి అధ్యాపకశ్రేష్ఠులు మమ్ము పునీతులను చేయుదురుగాక.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.