గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2014, శుక్రవారం

యౌవనం జీవనం చిత్తం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. యౌవనం జీవనం చిత్తం ఛాయా లక్ష్మీశ్చ స్వామితా
చంచలాని షడేతాని జ్ఞాత్వా ధర్మరతో భవేత్. 
గీ. యౌవనము, నీడ, మనసును, జీవితమును, 
సంపద, ప్రభుత యనునారు చంచలమను 
నిజము నెఱుగుచు సద్వర్తని రతుఁడగుచు 
ధర్మ మార్గము విడఁ బోడు ధన్య జీవి.
భావము. యౌవనము, జీవితము, మనస్సు, నీడ, సంపదలు, ప్రభుత్వము అను ఆరును చంచలమైనవని గ్రహించి మానవుడు ధర్మమునందు ఆసక్తుడు కావాలి. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును అసలు చంచల మైనవీ అసాస్వత మైనవీ విడనాడి సాస్వతమైన ధర్మ మార్గమున ప్రవర్తించినవారు ధన్యులు .అందుకు చాలా కృషి చేయాలి మంచి శ్లోకం బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.