గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2014, మంగళవారం

దుఃఖం దదాతియోஉన్యస్య...మేలిమి బంగారం మన సంస్కృతి, 217.

జైశ్రీరామ్.
శ్లో. దుఃఖం దదాతియోన్యస్య ధ్రువం దుఃఖం స విందతి
తస్మా న్న కస్యచిత్ దుఃఖం దాతవ్యం దుఃఖ భీరుణా. 

క. దుఃఖమితరులకుఁ గొలిపిన, 
దుఃఖంబతనికిని కలుగు తోడనె, కానన్ 
దుఃఖముగొలుపడొరులకిల 
దుఖమునకు వెఱయు వాడు తోయజ నేత్రా.
భావము. ఇతరులకు ఎవడు దుఃఖం కలిగిస్తాడో అతడు నిశ్చయంగా దుఃఖాన్ని పొందుతాడు.అందువల్ల దుఃఖానికి భయపడే వాడెవ్వడూ ఎవరికీ దుఃఖం కలిగించకూడదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇతరులకు మనం చేసింది మంచైనా చెడైనా తప్పక ఫలితం మనకు లభిస్తుంది అందుకే వీలైనంత వరకు బాధించని పనులే చేయడం మనకి శ్రేయస్కరం .ఇది మాత్రంచాలా మందికి అనుభవేద్యమే .చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.