గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జూన్ 2014, బుధవారం

దుర్జనస్య విశిష్టత్వం పరోపద్రవ కారణం...మేలిమి బంగారం మన సంస్కృతి, 221.

జైశ్రీరామ్.
శ్లో. దుర్జనస్య విశిష్టత్వం పరోపద్రవ కారణం !
ఉపోషితస్య వ్యాఘ్రస్య పారణం, పశుమారణమ్ ! 
గీ. దుష్టులందున శాంతము దురిత కరము. 
సమయమునకు వేచి సహించి, సమయఁ జేయు.
ఆకలిగనుండు పులి జంతు వమరు వరకు.
చంపి భక్షించు నమరిన సహజ మదియె.
భావము. దుర్జనుడు సౌమ్యంగా ప్రవర్తిస్తున్నాడంటే , అది పరులకు మరింత హాని చేయటానికే ! ఉపవాసం ఉన్న పులి చేసే పారణం , (ఉపవాసానంతర భోజనం) పశు మారణమే కదా !
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బహుస అటువంటి వారినే అతివినయం ధూర్త లక్ష్ణణం అంటారను కుంటాను ఇంకా మేకవన్నె పులి , తేనె పూసిన కత్తి ఇలా బోలెడు పర్యాయ పాదాలు బాగుంది మంచి సూక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.