జైశ్రీరామ్.
శ్లో. గంగా పాపం , శశీ తాపం , దైన్యం కల్పతరుస్తథా పాపం తాపం చ దైన్యం చ హంతి సంతో మహాశయాః.
క. పాపమును బాపు గంగయు,
తాపంబును బాపును శశి తరు కల్పకమే
పాపును దైన్యము. సంతులు
పాపుదురీ మూడు మనకు వారిని చేరన్.
భావము. గంగానది పాపాన్ని ,చంద్రుడు తాపాన్ని ,కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలుగుతాయి.మహాశయులైన సజ్జనులు ఈ మూడింటిని వారే తొలగించగలరు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
మహాత్ము లైనవారికి అంతటి దివ్యశక్తి ఉంటుంది కదా ! అందుకే వారు చేయలేని దేదీ లేదు కాకపోతే ఆశక్తి లభించడం పూర్వ జన్మ సుకృతం .చక్కని సూక్తి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.