జైశ్రీరామ్.
శ్లో. ఉద్యోగః ఖలు కర్తవ్యః ఫలం మార్జాలవద్భవేత్జన్మప్రభృతి గౌర్నాస్తి పయః పిబతి నిత్యశః.
క. ఫల సాధనకై సతమును
సెలవెఱుగక పిల్లివోలె చెలగుట తగు, తా
కలుగకపోయియు ఆవును
వలసిన పాల్త్రాగు పిల్లి. భావించుడయా!
భావము. ఫలితాన్ని పొందేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పుట్టినప్పటినుండి తనకు ఒక ఆవు లేకపోయినా, నిరంతర ప్రయత్నంతో పిల్లి ప్రతిరోజూ పాలను త్రాగుతూనే ఉంది!
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందుకే అన్నారు " సాధనమున పనులు సమకూరు ధరలోన అని " మనిషి పిల్లి కంటె ఎన్నో ఎన్నెన్నో రెట్లు నయం కదా ! చాలా బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.