గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఏప్రిల్ 2017, మంగళవారం

ప్రజ - పద్యమ్ . శ్రీ అర్క సోమయాజి. అవినీతిపై కవనాస్త్రం

 జైశ్రీరామ్.
క. సోమార్క నిజము పలికిరి. 
ధీమంతులు కలసి వచ్చి తేవలె మార్పున్
క్షేమము భవితకుఁ గొలుపఁగ. 
రామా యీ సుకవి మాట రాజిలనిమ్మా!
జైహింద్.
Print this post

2 comments:

Dhanikonda Ravi Prasad చెప్పారు...

పద్యాలు అద్భుతంగా ఉన్నాయి, ధారాశుద్ధి కలిగి ఉన్నవి. ముఖ్యంగా ఓటుకు నోటు అనే పద్యం లో నోటు యొక్క లీలలను నోటును విడిచిపెట్టకుండా వర్ణించటం చమత్కారంగా ఉన్నది. ఇంత అందం గా ఉన్న పద్యాలలో పోటీ దృష్టితో చూసినప్పుడు ఏమైనా లోపం ఉన్నదా ? అంటే ఆ చిన్నచిన్న లోపాలు ఇవి. "నో యనే పదము" అనేది వ్యావహరికము. "నోటికి నోయటంచనగ" అంటే సరిపోయేది."ప్రత్యక్షపరోక్ష పన్నులు" అనేది వైరిసమాసం."ప్రత్యక్ష పరోక్ష శుల్కములు" అనే పదం ఉపయోగించి ఉండవలసినది. "పెన్మహావృక్షము" లో పెను, మహా అనేవి పునరుక్తి. "నమ్మకబీజాలు" కూడా వైరి సమాసమే."విశ్వసబీజముల్" అనవచ్చు. శుభ్రపరచు బాట అనక శుభ్రపరచెడు బాత అన్నప్పుడు లఘువు ఎక్కువైనది. ఇవి మినహా పద్యాలు అమోఘంగా ఉన్నాయి . శ్రీ అర్కసోమయాజి గారికి అభినందనలు.

Malleswara చెప్పారు...

సోమయాజి గారు పద్యములు చాలా బాగున్నాయి. "నోటు" పద్యము బాగున్నది. అవినీతిపై మీ అస్త్రములు బాగున్నాయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.