గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఏప్రిల్ 2017, బుధవారం

రాజేశ్వరక్కయ్యకు శస్త్ర చికిత్స సత్ఫలప్రదమయింది.

  జైశ్రీరామ్.
శ్రీమతి నేదునూరి రాజేశ్వరక్కయ్య.
ఆర్యులారా! మన నేదునూరి రాజేశ్వరక్కయ్యకు శస్త్ర చికిత్స  ఫలప్రదమయింది. 
శస్త్ర చికిత్సాలయము నుండి ఇంటికి పంపించినారట. 
ప్రస్తుతం కులాసాగా  ఉన్నారని తెలిసింది. 
అతి త్వరలో మన బ్లాగులను చదువుతూ వారి అమూల్యమైన అభిప్రాయాలతోపాటు 
సూచనలను కూడా ఇవ్వగలరు.
అక్కయ్య ఆరోగ్యం కుదుట పడాలని, వేగంగా క్రోలుకోవాలని 
సహృదయులయిన మీరంతా ఆకాంక్షించారు. 
మీ ఆకాంక్షల సత్ ఫలమే అక్కయ్య పునరారోగ్యవంతులవటం.
మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
అక్కయ్యకు పరిపూర్ణ ఆరోగ్యంతో 
నిండు నూరేళ్ళ జీవితాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకొంటూ 
ఆంధ్రామృతం పాఠకుల తరపున అక్కయ్యకు అభినందనలు తెలియఁ జేస్తున్నాను.
 జైహింద్.
Print this post

10 comments:

అజ్ఞాత చెప్పారు...

అక్కయ్యగారు భగవానుని దయ వలన మీ ఆరోగ్యం కుదుటపడినందులకు చాలా ఆనందంగా ఉంది.
Suryanarayana Rao Ponnekanty
April 19 at 2:31pm

అజ్ఞాత చెప్పారు...

Thank you for the information. Please do convey my best wishes to her.
Rao Tallapragada

అజ్ఞాత చెప్పారు...

చాలా సంతోషకరమైన విషయం తెలియజేశారు.
Goli Sastry

అజ్ఞాత చెప్పారు...

చాలా మంచివార్త! అక్కయ్యగారు త్వరగా కోలుకుంటారు.
గన్నవరపు నరసింహమూర్తి

అజ్ఞాత చెప్పారు...

Thank you mama.
Bommakanti Madhurima

అజ్ఞాత చెప్పారు...

సంతోషమండి.
Polimera Malleswara Rao

Unknown చెప్పారు...

.అక్కయ్యకునారోగ్యము
దక్కగ దైవంబు జూడ?దాక్షిణ్యతతో
మక్కువనింపగ”శారద”
నిక్కము నూరేళ్ల బ్రతుకునిలుపును విధిగా|

Unknown చెప్పారు...

అక్కయ్యకునారోగ్యము
దక్కగ దైవంబు జూడ?దాక్షిణ్యతతో
మక్కువనింపగ”శారద”
నిక్కము నూరేళ్ల బ్రతుకునిలుపును విధిగా|

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈశ్వరప్ప మాట లీశాని వినుచుండె
తప్పకుండ ప్రోచు తగునటులుగ.
నిక్కమిలను కాచు నక్కయ్య నెప్పుడూ
చక్కనైన కవివి. సన్నుతింతు.

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

చాలా సంతోషకరమైన వార్త..అక్కయ్యగారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.