గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఏప్రిల్ 2017, మంగళవారం

ప్రజ - పద్యమ్. ౨. శ్రీ మల్లప్ప వసంతరావు . . . ఆకాంక్ష. ప్రథమ బహుమతి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రజ పద్యం రచనల పోటీలో ప్రథమ బహుమతిని సాధించుకొనిన శ్రీ మల్లప్ప వసంత రావుగారి ఆకాంక్ష చూడండి.
 తే.గీ. కాన పద్యములల్లెద కష్ట జీవు 
లెల్లరకు సాంత్వనమునీయ యుల్లమలరు 
లలిత పద బంధ సరళి నిలపయి యలర 
సకల జనులొందు సుఖమును సంతతముగ
కవిగారికి నా అభినందనలు.
క. చల్లని హృదయము కలిగిన
మల్లప్ప వసంత రావు మహితాకాంక్షల్
మెల్లగ సమకూర్చుమయా!
యుల్లంబులు పొంగునట్టులో పరమేశా!
జైహింద్
Print this post

3 comments:

అజ్ఞాత చెప్పారు...

చక్కని పద్యములు. అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

చక్కని పద్యములు. అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

రామకృష్ణ రాయ ధీమణి! "చింతా" సు
వంశ సోమ!మీకు వందనములు
నన్ను ప్రోత్సహించి నారందమగు కంద
మందు తెలుపుచు నభినందనలను.

ధన్యవాదముల్ తెలిపెద మాన్యులైన
మీకు, మీ మంచి మనసుకు మీ సహృదయ
స్పందనకు నాటవెలదియే చాలదనుచు తేటగీతిని తోడ్కొని తెచ్చి యిడుచు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.