గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2017, ఆదివారం

నేడు శ్రీ శ్రీ 107 వ జయంతి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు స్వర్గీయ శ్రీరంగం శ్రీనివసరావు అంటే మన మహాకవి శ్రీశ్రీ గారి 107 వ పుట్టినరోజు.
ఈ మహానుభావునికి 1970 ఫిబ్రవరి 1 వ మరియు 2 వ తేదీలలో విశాఖపట్టణంలో ష్ష్టి పూర్తి మహోత్సవం చాలా ఘనంగా జరిగింది.  అప్పుడు నేను విజయనగరం ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ మొదటి సంవత్సరం విద్యార్థిని. షష్టిపూర్తి సభకు నేనూ నా మిత్రులు పంతుల జోగారావు, మంగిపూడి వేంకటరమణమూర్తి, P.V.B.శ్రీరామమూర్తి, దువ్వూరి పేరయ సోమయాజులు, బగ్గాం రామజోగారావు ఇంకా కొంతమంది వెళ్ళాము.. కవిసమ్మేళనంలో ఆఖరున నాకూ పాల్గొనే అవకాశం ఇచ్చారు.
ఆనాటి కార్యక్రమ వివరాలు.
షష్టిపూర్తి మహోత్సవం వార్తను ముందుగా ప్రకటించిన ప్రజారథం పత్రిక (శ్రీభాట్టం శ్రీరామమూర్తి)
వేదికపై ప్రజాకవులనుద్దేశించి ప్రసంగిస్తున్న శ్రీశ్రీ.  
మహాసభ జరిగుటకు ముందు సభలో ఉన్న శ్రీశ్రీ తెన్నేటి విశ్వనథం, తాపీ ధర్మారావు,
కే.వీ.రామలక్ష్మి, తూమాటి దొణప్ప, పురిపండా అప్పలస్వామి,
 రాచకొండ విశ్వనాథ శస్త్రి, కాళోజీ, 
రమణారెడ్డి, గోరా శాస్త్రి, దిగంబర కవులు, వరవరరావు, 
వెల్చేరు నారాయణరావు, ఆరుద్ర, మున్నగు మహనీయులు.
తాపీ ధర్మారావు తెన్నేటి విశ్వనాథం లమధ్య నించున్నది నేనే.
ఆ నాటి సభ నాకు జీవితములో మరపునకు రాని మ్హా ఘట్టము.
ఈనాడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకొంటూ నివాళి అర్పిస్తున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.