జైశ్రీరామ్,.
కృతి
రచనకుఁ బ్రశస్త వారములు
గీ. శుక్ర - గురు - బుధ వారముల్ - సొంపు సేయు
సోమవారంబు సంపదల్ - సొరిది నిచ్చు
శనియు మంగళవారముల్
- చావుదెచ్చు
భానువారంబు సంగరం - బమరఁ జేయు.
(సులక్షణసారము 269)
భావము. బుధ వారము, గురువారము, శుక్రవారము, కృతి యారంభించిన
గ్రంథముమనోహరంబయి యుండును. సోమవారమునాడు ఆరంభించిన సంపద కలుగును.శనివారము, మంగళ వారము ఆరంభించిన మృతి సంభవము.
ఆది వారము ఆరంభించిన కలహము సంభవించును.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.