జైశ్రీరామ్.
ప్రాసలను గూర్చి తెలుసుకొందాం.
1) అర్థ బిందు సమప్రాస :-
ప్రాసాక్షరానికి ముందు అర సున్న అన్ని
పాదాలలో నుంచుట. " వీఁక - తాఁకి "
2) పూర్ణ బిందు సమప్రాస :-
మొదటి పాదంలో ప్రాసాక్షరం పూర్ణ బిందు
పూర్వక మైనట్లైతే ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రాసాక్షరం బిందు పూర్వకమే
అవాలి. " పొందు - బృంద "
3)ఖండాఖండ ప్రాస :-
అర సున్న కలిగి యున్న ప్రాసాక్షరంతో
అరసున్న లేని ప్రాసాక్షరాన్ని ఆ పద్యంలో ప్రాసగా ప్రయోగించ వచ్చును."
బోఁ టి - పాట "
4) సమ్యుక్తాక్షర ప్రాస :-
ఏ సమ్యుక్త హల్లు ప్రాస స్థానంలో ఉంటుందో
అదే సమ్యుక్త హల్లు ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రయోగించాలి. " అక్ష
- కుక్షి "
5) సమ్యుతాసమ్యుత ప్రాస :-
రేఫ యుత సమ్యుక్తాక్షరముతో రేఫ రహితమైన
అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "
6) లఘు ద్విత్వ ప్రాస :-
సమ్యుక్త పూర్వాక్షరము లఘువయితే మిగిలిన
అన్ని పాదాలలోనూ అటులనే రావాలి.
"విద్రుచు - అద్రువ" (ప్రాస పూర్వాక్షరం గురువైతే గురువే; లఘువైతే లఘువే రావాలి)
7)వికల్ప ప్రాస :-
అనునాసిక వికల్ప సంధ్యక్షరములకు ప్రాస.
" దిఙ్మహిత - యుగ్మ .
8) ఉభయ ప్రాస :-
" న - ణ " లకు,
" స - ష " లకు,
ప్రాస.
" ప్రాణ - దాన " వసుధ - విషమ "
9) అను నాసిక ప్రాస :-
భ/ క్తిమ్ముర < భ/ క్తిన్ + ముర = భ/ క్తిం ముర > తో - తమ్ములు. కు ప్రాస.
10) ప్రాస మైత్రి ప్రాస :-
" మ్మ - ం బ " లకు ప్రాస చెల్లును.
11) ప్రాస వైరము :-
" ర - ఱ " లకు ప్రాస పనికి రాదు.
12) స్వ వర్గజ ప్రాస :-
" థ - ధ " లకు,ప్రాస చెల్లును.
" ద - ధ " లకు ప్రాస చెల్లును.
13) ఋ ప్రాస :-
" ఋ - ర " లకు ప్రాస చెల్లును. ఉ: " ఆఋషి - చీరలు "
14) లఘు యకార ప్రాస :-
" ఆయజు < ఆ + అజు > - శాయికి
"
15) అ భేద ప్రాస :-
" ల - ళ " లకు ప్రాసచెల్లును.
" ల - డ " లకు ప్రాస.చెల్లును.
16) సంధి గత ప్రాస :-
వ/ చ్చెంగుంతి < వ/ చ్చెన్ + కుంతి > - సింగము.
మొదలగునవి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.