గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

యతులు వివరణము.

జైశ్రీరామ్.
యతులు
స్వర యతులు:-
1) స్వరమైత్రి వళి :-
అ ఆ ఐ ఔ . {ఫ్రెండ్స్}
ఇ ఈ ఋ ౠ ఎ ఏ {ఫ్రెండ్స్}
ఉ ఊ ఒ ఓ {ఫ్రెండ్స్}
పైన తెలిపిన క్రమంలోనే అచ్చులకు యతి మైత్రి చెల్లుతుంది. హల్లులలో వుండే అచ్చులు పై క్రమంలోనే ప్రయోగించాలి

2) స్వర ప్రధాన వళి:-
అచ్చులకు సంధి అయిన చోట పర పదంలోని మొదటి అచ్{వంశ్+అ = వంశ + అబ్ధి దీనిలో అబ్ధి అనే పదంలోని} " అ " అనే అచ్చుకే యతి వేయాలి.
3) లుప్త విసర్గక స్వర వళి:-
తమః + అర్క > తమోర్క. ఇలాగ విసర్గ మీద అకారము ఓ కారంగా మారిపోతున్నప్పుడు అందులోగల " అ " కారానికే యతి వేయాలి.

4) ఋ వళి:-
"ఋ" తో గాని, ఋ నే వట్రసుడిగా కలిగి యున్న హల్లులోగల వట్రసుడితో గాని రి రీ రె రే లకు యతి కుదురుతుంది.

5) ఋత్వ సంబంధ వళి:-
వట్రసుడి తో ఇ ఈ ఋ ౠ ఎ ఏ లకు యతి చెల్లు తుంది

6) ఋత్వ సామ్య వళి:-
వట్రసుడి గలిగిన హల్లులు అవి యేవైనాసరే హల్ల్ సామ్యంతో నిమిత్తం లేకుండా వట్రసుడులు కలిగివుంటే చా;లు యతి చెల్లును.

7) వృద్ధి వళి:-
అ కరమునకు ఎ ఏ ఐ లు పరమైన ఐ కారమూ, ఒ ఓ ఔ లు పరమైన ఔ కారమూ సంధిలో వచ్చిన వృద్ధి సంధి అంటారుకదా! అలాంటి చోట సంధి కాక ముందున్న అచ్చుతోనైనా, సంధి అయిన తరువాత వచ్చిన అచ్చుతోనైనా యతి వేయ వచ్చును.
ఇవే స్వర యతులు.

వ్యంజన యతులు :-

1) వర్గజ యతులు :-
కవర్గాదులలో పంచమాక్షరం మినహ మిగిలిన 4 హల్లులూలకూ పరస్పరం యతి చెల్లును.
క. ఖ. గ. ఘ. { } వర్గజ యతి
చ. ఛ. జ. ఝ. { } వర్గజ యతి.
ట. ఠ. డ. ఢ. { } వర్గజ యతి
త. థ. ద. ధ. { } వర్గజ యతి.
ప. ఫ. బ. భ. { } వర్గజ యతి.
ఏ వర్గక్షరములకా వర్గాక్షరములు తమలో తాము యతిచెల్లును.

2) బిందు యతి :-
" ఙ " తో > ంక. ంఖ. ంగ. ంఘ.
" ఞ " తో > ంచ. ంఛ. ంజ. ంఝ.
" ణ " తో >ంట. ంఠ. ండ. ంఢ.
" న " తో > ంత. ంథ. ంద. ంధ.
"మ " తో >ంప.ంఫ. ంబ. ంభ. లు బిందు యతిపేరుతో పరస్పరము చెల్లును.

3) తద్ భవ వ్యాజ యతి :-
" జ్ఞ -- ణ " లు పరస్పరము చెల్లును.

4) విశేష యతి :-
" జ్ఞ " ---- ఘ. లు పరస్పరము చెల్లును.

5) అనుస్వార సంబంధ యతి :-
" ంట - ంఠ - ండ - ంఢ - ంత - ంథ - ంద - ంధ - లు పరస్పరము చెల్లును.

6) అను నాసికాక్షర యతి :-
" న " తో > ంట - ంఠ - ండ - ంఢ. చెల్లును.
" ణ " తో > ంత -ంథ - ంద - ంధ. చెల్లును.

7) ము కార యతి :-
"పు - ఫు - బు - భు - ము ' లు చెల్లును.

8) మ వర్ణ యతి :-
" - ం య - ం ర - ం ల - ం వ -ం శ - ం ష - ం స - ం హ " లు చెల్లును.

9) సరస యతి :-
" -- హ " లు చెల్లును.
" ------ స " లు చెల్లును.
" - ణ " లు చెల్లును.

10) అ భేద యతి :-
" - బ " లు చెల్లును. (అ భేద వర్గ యతి-"  ---- వ " లు చెల్లును.)
" - ళ " లు చెల్లును.
" - డ " లు చెల్లును.

11) అ భేద వర్గ యతి :-
" ---- వ " లు చెల్లును.

12) సంయుక్త యతి :-
" క్ష్మ " వంటి సం యుక్త హల్లులో గల " క -- మ "లలో యేదో వొక దానికి యతి వేయ జెల్లును.

13) అంత్యోష్మ సంధి యతి :-
" వాక్ + హరి = వాగ్ఘరి " ఇందు " క ' తో గాని " హ " తో గాని యతి వేయ జెల్లును.

14) వికల్ప యతి :-
" సత్ + మతి = సన్మతి. " ఇందు " త " తో గాని " న " తో గాని యతి వేయ జెల్లును.

ఉభయ యతులు :-

1) యుష్మ దస్మచ్ఛబ్ద యతులు :-
యుష్మదాగమనము < యుష్మత్ + ఆగమనము > ఇందులో " ద - అ " లు పూర్వ పదాంత, పరపదాది వర్ణాలు. వీటిలో దేనికైనా యతి వేయ జెల్లును.

2) పర రూప యతి :-
వేదండ < వేద + అండ > అఖండ శబ్దము వలె గాన వచ్చుటచే యిట్టి పదములలో ఉభయ యతి. అనగా " ద - అ " అను రెందింటిలో ఏ వొక్క అక్షరంతోనైనా యతివేయ జెల్లును.

3) ప్రాది యతి :-
ప్రాప్తి < ప్ర + ఆప్తి > యిందు " ప్ర - ఆ " అనే 2 వర్ణములలో ఏ వొక్క దానితో నైనను యతి గూర్ప జెల్లును.

4) అ ఖండ యతి ( లేదా ) నిత్య సమాస యతి :-
కర్ణాట < కర్ణ + అట > ఇది పద విభాగము తోపని నిత్య సమాసము గావున యిట్టి పదములలో " ర్ణ - అ "అను 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.

5) దేశ్య నిత్య సమాస యతి :-
క్రిక్కిఱియుట < క్రిక్కు + ఇఱియుట > అచ్ సంధి అయి యేక పదముగా కనిపించుచున్న దేశ్య పదములందు " క్కు - ఇ " వంటి 2 వర్ణములలో ఏ వొక్క వర్ణముతో నయినను యతి గూర్ప జెల్లును.

6) నిత్య యతులు :-
క్రూర కర్ముడేనియు < క్రూరకర్ముడు + ఏనియు > యిందు " ఐనాసరే అనే అర్ధంలో ఏనియు అనేపదంతో కూడిన మొదటిపదం నిత్య సమాసంగా కనిపిస్తున్నందున యీ పదంలో " డు - ఏ " అనే 2 వర్ణాలలో ఏవొక్కవర్ణంతోనైనను యతి వేయ జెల్లును.

7) రాగమ సంధి యతి :-
జవరాలు < జవ + ఆలు > ఇందు { ర్ + ఆగమ } (ర్) ర ఆగమంగా వచ్చినందున యిట్టి చోట " ర - అ " అను 2 వర్ణములలో ఏ వొక్క దానికైనను యతి గూర్ప జెల్లును.

8) విభాగ యతి :-
గంపెడేసి < గంపెడు + ఏసి > ఇట్టివి నిత్య సంధులు. ఇట్టిపదములలో " డు - ఏ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.

9) నామాఖండ యతి :-
రామయ్య < రామ + అయ్య > ఇట్టి అఖండ నామములలో " మ - అ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.

10) పంచమీ విభక్తి యతి :-
రామునికన్న < రామునికి + అన్న > < రామునకు + అన్న >
రామునికంటే < రామునికి + అంటే >
ఇట్టి పదాలలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ జెల్లును.

11) కాకు స్వర యతి :-
లేరో < లేరు + ఓ > ఇట్టి పదములందు " రు - ఓ " అనునటువంటి 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ జెల్లును.

12) ప్లుత యుగ యతి :-
ఏ గతి కాచెదో రఘుపతీ < ఏ గతి కాచెదు + ఓ > మొదటి వర్ణమునందు, యతి స్థానమునందు ప్లుతవర్ణములున్నందున ఈ 2 ప్లుత వర్ణములకు యతి వేయ జెల్లును.

13) ప్రాస యతి :-
సీసము. తేటగీతి. ఆటవెలది.పద్యములందు యతికి బదులు ప్రాస యతి వేయ జెల్లును.
:- తే.గీ - తెలుగు భాషయె జగతిని వెలుగు నిజము. < తెలు - వెలు > తె మొదటి అక్షరము. యతి స్థానమున యతి వేయ బడక దాని తరువాత గల ప్రాసాక్షరమునకు యతివేయబడినందున యిది ప్రాసయతికి ఉదాహరణ యగుచున్నది.
తరువాత ప్రాస తెలుపఁబడును.
జైహింద్.
Print this post

8 comments:

Pada Kusuma Mala చెప్పారు...

చాలా విలువైన సమాచారం అందించారు ధన్యవాదములు. కానీ మధ్య మధ్యలో ఫోటోలు కాకుండా స్వయంగా టైపు చేసి ఉంటె ప్రింట్ తీసుకుని రిఫెర్ చేసుకునే వీలు ఉండేది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మీ సూచనననుసరించి నేను మొత్తం టైపు చేసి ఇప్పుడు పెట్టాను చూడండి.

Dr Srinivas Nagulapalli చెప్పారు...

చాలా చక్కని సమాచారం... ప్రతీ రకపు యతి కి ఉదాహరణ తో వివరిస్తే.. ఇంకా ప్రశస్తం.. 👌

Unknown చెప్పారు...

ఉదాహరణలతో ఇంకనూ ఉపయోగకరం కాగలదు

Unknown చెప్పారు...

చాలా మంచి సమాచారమందించారు. ముందుగా కృతజ్ఞతలు.ప్రతీ యతికి ఉదాహరణను జోడించి
తెలిపినచో మీరు చేసిన ఈ మంచి ప్రయత్నం మరింత సార్థకము,ఉపయోగకరము కాగలదని మనవి.

Unknown చెప్పారు...

పద్యం వ్రాయాలంటే ఔత్సాహికులకు మీ ప్రయత్నం
ప్రోత్సాహకరంగా ఉంది.అభినందనలు

ఆదిభట్ల సత్యనారాయణ చెప్పారు...

చాలా విలువైన సమాచారం. ధన్యవాదములు

అజ్ఞాత చెప్పారు...

చాలా విలువైన సమాచారం. ఉదాహరణలతొ వివరించి ఉంటె ఇంకా ఉపయోగకరంగా ఉండేది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.