గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, డిసెంబర్ 2009, ఆదివారం

నే పొందిన సజ్జన సాంగత్య ఫలం.




మిత్రులారా! ఆ పరమాత్మ మనకు సజ్జన సాంగత్యం సంప్రాప్తింపఁ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
" కథామంజరి " బ్లాగరు శ్రీ పంతుల జోగారావు.M.A., మంచి మంచి సాహిత్యాంశాలను మనముందుంచుతున్నారు. అవి మన మానసోల్లాస కరంగా ఉంన్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
వారి ప్రశ్నలకు నా స్పందనలను కొన్ని మీ ముందుంచుతున్నాను. గమనించ మనవి.


పంతుల జోగారావు | Posted in the blog KATHAMANJARI on Saturday, December 12, 2009 | in the label " మన సాహితీ సంపద"


రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ
యిత్థం విచింతయతి కోన గతే ద్విరేఫే
హా ! హంత హంత ! నళినీం గజవుజ్జహార !


దానికి సమాధానంగా నేను వ్రాసిన పద్యం.
క:-
రాతిరి ఆయెను, చిక్కితి,
పూతలుపులు మూసుకొనగ.పూజ్యుడు సూర్యుం
డేతరి వచ్చెడు నని, యలి,
వేతు ననెను. రాత్రి పీఁకివేసెను గజమున్.
(చింతా రామకృష్ణారావు. Said On Saturday, December 12, 2009)




22-12-2009.వ తేదీని జోగారావుగారు తన కథామంజరి బ్లాగులో ఉంచిన ప్రశ్న.
నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేత బట్టి, నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాధుని పిలిచెన్ !!


దానికి నా ప్రత్యుత్తరం తిలకించండి.
క:-
ఉత్తర భరణిని చేఁ గొని,
యత్తఱి యభిమన్యుఁ బిలిచె నాశగ తనతో
నెత్తఱి మూలకు రమ్మని
మత్తుగ చెయి వేసి పైన. మహనీయుండా!


ఈ నా సమాధానానికి ఆ కవిగారి స్పందన చూడండి.
క:-
చుక్కల చిక్కుల పేరిట
చిక్కని పద్యము నొసగఁగ చింతా వారూ !
చక్కగ వివరించిరి కద !
మిక్కిలిగా నాదరింతు మదిలో మిమ్మున్. !


సజ్జన సాంగత్యఫలాన్ని ఈ విధంగా పొందిన నేను అదృష్టవంతుడనుగా భావిస్తున్నాను.
మరి మీరేమంటారు?


జైహింద్.
Print this post

2 comments:

durgeswara చెప్పారు...

అవును

కథా మంజరి చెప్పారు...

మీ ప్రశంస చూసాను. వాస్తవానికి అంతటి ప్రశంసకి నేను పాత్రుడను కాను. మీరు నా మీద గల ఆదరాభిమానములతో అలా వ్రాసారని తలుస్తున్నాను.
సరే, మీరన్నట్టుగా సజ్జన సాంగత్య ఫలం అనిర్వచ,నీయమైన ఆనందాన్ని యిస్తుంది. అట్టి ఆనందాన్ని చిర కాలంగా, అంటే మనం విజయ నగరంలో భాషా ప్రవీణ చదివే రోజుల నుండి నేను మీ వల్లను, మన మిత్రుల వల్లను పొందుతూనే ఉన్నాను.
మన విత్రుల గురించి మరో సారి ఇక్కడ ముచ్చటిస్తున్నాను:
మంగి పూడి వెంకట రమణ మూర్తి - గొప్ప హరి కథకులు కవి.
పి.వి.బి.శ్రీరామ మూర్తి - ప్రముఖ కథా, నవలా రచయిత,
బి. రామ జోగారావు - మంచి నటుటు.
స్వర్గీయ డి.పి.పోమయాజులు - కవి.
మరి మీరు ... పండితులు, కవి,
ఇందరి స్నేహం పొందిన నేను ధన్యుడను కదా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.