సహృదయ బంధూ!
ఈ క్రింది కందంలో గల ప్రశ్నకు సమాధానం చాలా సులువే మీకు. అఈ సమాధానం చెప్పడమే కాక అది ఛందో బద్ధంగ కందంలాంటి దానిలో చెప్పితే చాలా ఆనందం కలుగుతుంది మన ఉభయులకే కాక తదితర పాఠకులకు కూడా.
గమనించండి.
క:-
కర చరణంబులు కలిగియు
కర చరణ విహీను చేత కర మరుదుగ తా
జల చరుడు పట్టు వడెనని
శిర హీనుడు చూచి నవ్వె చిత్రము కాగన్.
చూచారుగా! మరింకెందుకాలస్యం? వెంటనే ప్రయత్నించి పంపండి.
జైహింద్.
Print this post
4 comments:
నమస్కారం
నాపేరు కృష్ణా అక్కులు.
మీరిచ్చిన పద్యంలో "3వ పాదంలో" ప్రాస "ర" రానందున తప్పినట్లున్నది. గమనించవలసింది.
అక్కుల వంశజ! కృష్ణా!
నిక్క మిది "యభేద ప్రాస" నెనరు "ర-ల"లకున్
చక్కఁగ నొప్పును. ప్రాసను
ధిక్కారము చేయలేదు.దీక్ష నెఱుఁగుడీ.
కప్ప మింగె పాము కని నవ్వెరా పీత
చనును మూడు చూడ జలమునందు
కాలు చేతులు గల కప్ప లేకయు పాము
తలయు లేక పీత ధరను వెలయు
అత్యద్భుతముగఁ జెప్పిరి
స్థుత్యముగా ఫణికుమార! సుకవుల పంచన్
నిత్యము నిలువగఁ దగుదు వ
సత్యము కాదయ్య. వినుత సద్గుణ వర్యా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.