సాహితీ ప్రియులారా!
మానవత్వము పరిమళించే మనము మన నిత్య కృత్యములలో తెలిసియు, తెలియకయు పాప కార్యములు చేయుచుందుము. తెలిసి చేసిన పాపానికి పరిహారము కర్మానుభవమే. మరి తెలియక చేసిన పాపము మన దృష్టికి వచ్చినచో ఆ జరిగిన పాపానికి మనము చాలా చింతిస్తూ ఉంటాము. ఆ విషయమై ఒక చక్కని శ్లోకము మనకు పూర్వీకులందించి యుండిరి. దానినిటఁ జూడుడు.
శ్లో:-
కృత్వా పాపం హి సంతప్య, తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే.
నైవ కుర్యాత్ పున రితి నివృత్యా పూయతే తు స:.
క:-
తెలియక పాపముఁ జేసినఁ
గలఁగి, మదిఁ దపింతు మేని కలుగదు పాపం
బలసత నికఁ జేయ ననుచుఁ
దలచినచో తద్విముక్తి తధ్యము మనకున్.
భావము:-
పాప కార్యము మనకు తెలియ కుండానే మనము మనచేఁ జేయఁబడినచో, అదితెసిన పిదప ఆ పాప భీతితో ఆవేదనకు లోనగుదుము. అట్టి తఱి తద్ విషయమై మిక్కిలి పశ్చాత్తాపముతో ఇకపై జాగరూకతతో మెలగి ఇట్టి పాపములు జరుగ కుండా చూచుకొందునని మనము దృఢచిత్తులమయి నిశ్చయించుకొన్నచో తెలియక చేసిన పాపము వలన కలిగిన దోషము ఆ పశ్చాత్తాపముతోనే పరిహారమగును.
అలసత్వము వీడి జాగరూకతతో పాపదూరులమై మనము ప్రవర్తింతుము గాక.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
1 comments:
అవునండీ నిజమే. పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా మన పెద్దలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.