సులభంగా చెప్ప గలిగిన చిన్న ప్రశ్న నిస్తున్న గీతపద్యాన్ని చూడండి.
సమాధానం వ్రాస్తారని ఆశిస్తాను.
గీ:-
ఒక్క ఉద్యోగి పేరు నాల్గక్కరములు.
మొదటి వర్ణంబు చెరపిన కదన మగును.
మూడవది చెరుపగ హస్తమునకుఁ జెల్లు
అట్టి ఉద్యోగి యెవ్వడో అరసి చెపుడు.
తప్పక సమాధానం వ్రాసి పోష్ట్ చేస్తారుకదూ!
జైహింద్.
Print this post
4 comments:
కం||
రాజుకు దక్షిణ హస్తము
లాజులు జల్లెడి ప్రజలకు లంకేశ్వరుడున్
జాజుల మోజుకు మదనుడు
రోజులు చెల్లిన నియంత కరణము కదరా!
ఒకానొక కాలంలో కరణం అవ్వడం ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. రాజులు కరణాలని నమ్మే వారు. కరణాలు రాజు తరువాత రాజులాగా వెలిగేవారు (వారి అగ్రహారాల్లో). వారు వెళ్ళే దారుల్లో ప్రజలు పేలాలు చల్లుతూ వారి కీర్తిని పొగిడేవారు. ఇక వారు కోరినదల్లా జరగడం ఆనవాయతీ. ఐతే, ఆ రోజులు ప్రజాస్వామ్యంతో వెళ్ళాయి.
కందము చెప్పుటలో మన
సందీపుని సా టిచూడ సందీపె యగున్.
నంద గోపకుమారుని
డెందంబునకలిగి యుంట ఠక్కున చెప్పున్.
కరమునందున పల్లెపై కలదు పట్టు
శిరమునూప నీకేదైనా సిద్ధమగును
అరసు వలెవెల్గు కరణమా కరుణ లేక
పెరికె కదనయ్య ప్రభుతనీ పెత్తనంబు
మురళీ మోహన్ గారూ౧ నిజమేనండి. కరణాలను పెరికి గ్రామాలపై ఒక పట్టు కలిగి సమైక్యత కాపాడే ఒక వ్యవస్తనే తుడిచిపెట్టారు.
ఆనాడు కరణం అరుసే. ఒక్కడే ఆనాడు పెత్తనం చెలాయించినా సామర్ద్యంతో గ్రామ పెద్దగా పనులు జరిపేవాడు.
ఈనాడు అందరూ పెద్దలే. సామాజిక న్యాయమే కరువయ్యింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.