బాపూ! నీ తలి,దండ్రి, నీకొఱకు యే ప్రఖ్యాతమౌ దేవతల్
ప్రాపున్బొందఁగ వారిఁ గొల్చిరొ కదా? భాగ్యంబు పండన్, నినున్
తా పూజా ఫలమట్లు పొందెఁగదయా! ధన్యాత్ములైనారు. నీ
ప్రాపున్మానవ జాతికూడ వెలిగెన్. ప్రఖ్యాత చిత్రాళితోన్.
బాపూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు !
జైహింద్.
Print this post
3 comments:
మిత్రమా, చక్కని పద్యం చెప్పావు. ధర్యవాదాలు. అభినందనలు
మీ పద్యంలో తప్పులెదికేంత వాణ్ణి కాను, తలిదండ్రి కర్త అయినప్పుడు క్రియ "గొల్చిరో కదా?" అని ఉండాలేమో?
నారాయణస్వామిగారూ! నిజమేనండి. మీరు సరిగానే దోషాన్నిసూచించారు.
నేను తల్లికి మాత్రమే అన్వయిస్తూ పద్యం వ్రాశాను.
తరువాతనిపించింది తండ్రి మాట మరచానని.. అప్పుడు తండ్రినీ చేర్చాను. ఒకచోట క్రియా పదం సరిచూచాను కాని మీరన్నది నేను గుర్తించలేదు.
మీలాంటివారు చక్కగా చూచి నిస్సందేహంగా చెప్పిననాడే అకళంకమై విరాజిల్లేలా చేయవచ్చు.
సరిచేశాను. చూడండి.
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.