ఈ చిన్ని పద్యంలో ఒకరితోనొకరికి సంబంధం గల వ్యక్తులు వరుసగా : ఇంద్రుడు , నరకుడు , నల్లనయ్య , జరాసంధుడు , భీముడు , ధర్మ రాజు , యముడు ... వాని వాహనం ... దున్నపోతు !!
షోడశ సుగుణస్వరూపుఁడు శ్రీరాముఁడు.
-
1 – గుణవాన్ / సౌశీల్యం : షరతులు లేకుండా ఉండండి
రాముడు అందరినీ సమానంగా చూసేవాడు. అతను వేటగాళ్ల నాయకుడు గుహ మరియు వానరుల (
కోతుల) రాజు సుగ్రీవుని తన సోదరు...
2 comments:
ఈ చిన్ని పద్యంలో ఒకరితోనొకరికి సంబంధం గల వ్యక్తులు
వరుసగా : ఇంద్రుడు , నరకుడు , నల్లనయ్య , జరాసంధుడు , భీముడు , ధర్మ రాజు , యముడు ... వాని వాహనం ...
దున్నపోతు !!
పాఠకులు ఆలోచనలో పడినట్లున్నారు.
ఈ పద్యంలో సారాంశం శ్రీ పంతుల జోగారావు సూచనప్రాయంగా తెలియఁజేశారు.
దానినే నేను వివరంగా ఇక్కడ తెలియఁ జేస్తున్నాను.
నగ పగతుడు = ఇంద్రునకు,
పగతు = శత్రువైన నరకాసురునకు,
పగతుకు = శత్రువైన కృష్ణునకు,
పగతుండౌ = శత్రువైన,
మగధరాజు = మగధ దేశాధిపతియైన జరాసంధుని,
పరిమార్చిన = సంహరించిన,
ఆ జగ జెట్టి = గొప్ప మల్లుడైన భీమునకు,
అన్న = అన్న అయినటువంటి ధర్మరాజుకు,
తాండ్రికి = తండ్రియైన యమధర్మ రాజుకు,
తగు వాహనము = తగిన వహనమైన దున్నపోతు,
ఐన యట్టి ధన్యుడవు = ఐన ధన్యాత్ముడవయ్యా!
ఓ దున్నపోతా! అని తాత్పర్యము.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.