జైశ్రీరామ్
|| 13-21 ||
శ్లో. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే.
తే.గీ. కార్యములకకార్యములకు కారణంబు
కనగ ప్రకృతి, నిజమదియె, కర్త పురుషు
డె, సుఖ దుఃఖానుభవముల కెన్న మదిని,
పార్థ! గ్రహియింపుమియ్యది, వరలనెంచి.
భావము.
కార్యాకార్యాలకు ప్రకృతి కారణము అని చెప్పబడుతుంది. సుఖదుఃఖాల
అనుభవాలకు కర్త పురుషుడని చెప్పబడతాడు.
|| 13-22 ||
శ్లో. పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|
కారణం గుణసఙ్గోऽస్య సదసద్యోనిజన్మసు.
తే.గీ. ప్రకృతిలోగలపురుషుడు ప్రకృతి గుణము
లనుభవించు,తత్ గుణములయనుభవమున
మంచిచెడులుండి జన్మకు సంచితఫల
ములవి కారణమగునయ్య! ఫలితమదియె.
భావము.
ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను
అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచీ,
చెడు జన్మలెత్తడానికి కారణము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.