గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2022, ఆదివారం

వాయుర్యమోగ్నిర్వరుణః శశాఙ్కః- ...11 - 39...//.నాన్తోస్తి మమ దివ్యానాం- , , .11 - 40,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

 జైశ్రీరామ్.

|| 11-39 ||

శ్లో.  వాయుర్యమోగ్నిర్వరుణః శశాఙ్కః

ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ|

నమో నమస్తేऽస్తు సహస్రకృత్వః

పునశ్చ భూయోऽపి నమో నమస్తే.

తే.గీ.  వరుణ చంద్రాగ్ని యములీవె వాయువీవె,

బ్రహ్మవీవే, ప్రజాపతి, బ్రహ్మ జనకు

లీవె, వందనములనందుమీవె మరల

మరల వందనంబులు నీకు నిరుపమాన.

భావము.

నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, 

ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది 

నమస్కారములు. మఱల మఱల నమస్కారములు. ఇంకను నమస్కారములు.

|| 10-40 ||

శ్లో.  నాన్తోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప|

ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా.

తే.గీ.  అర్జునా! నా విభూతుల కంతు లేదు.

వాటి విస్తారమును తెల్పువాడ నేను

నీకు నిప్పుడే తెలియగా  నీవు వినుము

నేర్పుతో గ్రహియింపుమా యోర్పుతోడ.

భావము.

అర్జునా! నా దివ్యమైన విభూతులకు అంతులేదు. నా విభూతుల 

విస్తారాన్ని క్లుప్తంగానే చెప్పాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.