జైశ్రీరామ్.
|| 13-13 ||
శ్లో. జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వామృతమశ్నుతే|
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే.
తే.గీ. దేని నరయ నమృతుడౌ సుధీర జీవు
డట్టి జ్ఞేయమున్ దెలిపెద, నదికలుగని
ది పరమగు బ్రహ్మమగు, సత్తది యరయగను
కా దసత్తునున్ గాదయ్య, కౌరవారి!
భావము.
దేనిని తెలుసుకోవడము వలన జీవుడు అమృతత్వాన్ని పొందుతాడో ఆ
జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. అది లేనిది పరబ్రహ్మము. అది సత్తు
కాదని, అసత్తు కాదని చెప్పబడుతుంది.
|| 13-14 ||
శ్లో. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖమ్|
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి.
తే.గీ. కాళ్ళు, చేతులు, తలలును, కళ్ళు, నోళ్ళు,
చెవులునంతటనుండును, చెలగి యావ
రించి యుండునంతటనిది, కాంచమనము,
నీవు గ్రహియించుమర్జునా నేర్పు మీర.
భావము.
దానికి అంతటా చేతులు, కాళ్ళూ, కళ్ళు, తలలూ, నోళ్ళు, చెవులు ఉండి,
అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.