|| 13-5 ||
శ్లో. ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్|
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః.
తే.గీ. ఇట్టి క్షేత్ర క్షేత్రజ్ఞ విషయమీన ఋషులు, వేద
ములుననేకవిధంబులతెలిపియుండె,
బ్రహ్మ సూత్రము వివరించె ప్రస్ఫుటముగ
సాక్ష్యములతోడనర్జునా! సరిగ వినుము.
భావము.
ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విషయము మహర్షుల చేత అనేక విధాలుగా
వివరింపబడినది. పెక్కు శాఖలు కలిగిన వేదాలలో ఇది
పలు విధములుగా విభజించి నిరూపించబడినది. బ్రహ్మసూత్ర
పదాలు దీనిని గురించి హేతు బద్ధంగా నిశ్చయించి చెప్పాయి.
|| 13-6 ||
శ్లో. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ|
ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః.
తే.గీ. గోచరములైదు, మరియు నగోచర మతి,
యష్టప్రకృతులు, తగ పది యనుపమేంద్రి
యములు, నిట్లిరువదినాల్గు నసమ మయిన
క్షేత్రములు కలవర్జునా! కీర్తిసాంద్ర!
భావము.
మహాభూతాలు(ఐదు)అహంకారము, బుద్ధి, అవ్యక్తము(అష్టవిధ ప్రకృతి),
ఇంద్రియాలు పది, మనస్సు, ఇంద్రియ గోచరవిషయాలు ఐదూ
(మొత్తం 24క్షేత్రాలు).
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.