జైశ్రీరామ్
|| 12-15 ||
శ్లో. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః|
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః.
తే.గీ. వ్యధను చెందెవ్వనిచేత, వ్యధను చెంద
డెవ్వడీ లోకమువలన, నెవ్వడిలను
ముక్తుడో విషాదోద్వేగములవలనను,
నాకు ప్రియుడాతడే సుమా నయనిధాన!
భావము.
ఎవరివల్ల లోకం వ్యధ చెందదో, లోకం వలన ఎవడు వ్యధ చెందడో,
సంతోషం, కోపం, భయం, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో
అతడు నాకు ప్రియుడు.
|| 12-16 ||
శ్లో. అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః.
తే.గీ. శుచియు, దక్షుండు, నిరపేక్షుడుచితములరసి
మెలగువాడహమేలేక చెలగువాడు
భక్తుడైనన్ను గొలిచెడి వాడు నాకు
బ్రీతుడిద్ధాత్రినర్జునా! వినుము నిజము.
భావము.
అపేక్ష లేని వాడు, శుచియైన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు,
వ్యధలు నశించిన వాడు, అన్ని విధాలైన, కార్యాలలలో నేను
చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.