గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2022, మంగళవారం

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి - ...13 - 3...//..... తత్క్షేత్రం యచ్చ యాదృక్చ - , , .13 - 4,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

 జైశ్రీరామ్

|| 13-3 ||

శ్లో.  క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత|

క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ.

తే.గీ. దేహములనొప్పుచున్నట్టి దేహిననుచు

నన్నెరుంగుమో యర్జునా! మన్ననమున,

మహిని క్షేత్రజ్ఞు క్షేత్రమున్ మన్ననమున 

దెలియుటే జ్ఞానమెరుగుము, తెలియుమయ్య. 

భావము. 

మరియు ఓ అర్జునా! సర్వదేహములందుండెడి క్షేత్రజ్ఞుడైన 

జీవుని నన్నుగా ఎరుగుము. ఇట్లు క్షేత్రక్షేత్రజ్ఞులగూర్చి 

తెలిసికొనెడి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా మతము.

|| 13-4 ||

శ్లో.  తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్|

స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు.

తే.గీ.  అట్టి క్షేత్రమేదో గననెట్టిదగునొ,

యెట్టి వగువికారములతో నెట్టుబుట్టె

నొ, యట క్షేత్రజ్ఞుడెవడగనో,ప్రభావ

మెట్టిదికలవాడొ, విను మిప్పట్టు తెలియ.

భావము.

ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారము కలదియో, దేనివలన 

బుట్టినదో, ఆ క్షేత్రజ్ఞుడెవ్వడో, ఎట్టి ప్రభావము గలవాడో ఆ సంగతిని 

సంగ్రహముగా నాద్వారా వినుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.