జైశ్రీరామ్.
|| 13-15 ||
శ్లో. సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్|
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ.
తే.గీ. ఇంద్రియమలెన్న లేనిది యింద్రియముల
లక్షణములున్న బ్రహ్మము, లక్ష్యమొప్ప
నంటుకొనకనె భరియించు నన్నిటిని, క
నగను గుణహీన, గుణముల సొగసునొందు.
భావము,
అపర బ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది,
ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండానే
అన్నింటినీ భరించేది, గుణ హీనమైనా కూడా గుణాలను భోగించేది.
|| 13-16 ||
శ్లో. బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ|
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్.
తే.గీ. కదులు కదలదు, ప్రాణులన్ గలుగు బయట
లోపలన్, గాని కనరాదు, శ్లోకులకది
చేరువనె యుండు,దురితుల చెంత నుండ
దట్టిదగు బ్రహ్మము,తలచిచూడ.
భావము.
అది(జ్ఞేయము)జీవుళ్ళకు బయటా, లోపలా ఉండేది, కదిలేది
కదలనిది కూడా ఐనా, సూక్ష్మము ఐనందువలన తెలియబడదు.
(అవిద్వాంసులకు)దూరంగానూ, విద్వాంసులకు దగ్గరగాను ఉన్నది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.