గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2022, సోమవారం

నేడు ఉపాధ్యాయదినోత్సవము. గురుస్థానీయులకు నమస్కరించుచు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.

 జై శ్రీమన్నారాయణ.🙏

నేడు ఉపాధ్యాయదినోత్సవము. గురుస్థానీయులకు నమస్కరించుచు 

ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.

శ్లో. గురవో నిర్మలాః శాన్తాః 
సాధవో మితభాషిణః ౹
రాగద్వేషవినిర్ముక్తాః 
సదాచారాః హితైషిణః ౹౹

చం. గురువులు నిర్మలాత్ములు వికుంఠమహత్పదమార్గదర్శకుల్,
గురువులు శాంతులున్, మరియు కోమల సాధు వినమ్ర భాషణుల్,
గురువులు రాగమున్ మరియుకూర్మిని చూపెడి ద్వేషహీనులున్,
గురువులు సత్ప్రవర్తకులు, కూర్మిని జూపు హితుల్, శుభాశ్రయుల్.

భావము.
గురువులు నిర్మలమయిన మనసు,శాంతస్వభావముతో ప్రకాశించువారు,సాధుస్వభావము కలవారు, హిత మిత భాషణ చేయు నిపుణులు, అనురాగమునకు ద్వేషమునకు అతీతులు, సదాచార సంపన్నులు, ఎల్లప్పుడూ జగద్ధితమునే కోరువారు అయి యుందురు. అట్టివారికి త్రికరణ శుద్ధిగా ప్రణమిల్లుచున్నాను.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.