జైశ్రీరామ్.
|| 12-7 ||
శ్లో. తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్|
భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్.
తే.గీ. ఎవరు నాలోన మనసుంచి యెల్లవేళ
లందు నుందురో వారిని బంధనములు
నేనె బాపుచు సన్ముక్తి నేనె గొలిపి
యుద్ధరించెదనర్జునా! యొప్పిదముగ.
భావము.
అర్జునా నాలో మనసు నిలిపిన వాళ్ళను త్వరలోనే మృత్యుసంసార
సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను.
|| 12-8 ||
శ్లో. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః.
తే.గీ. నీవు నాలోనె బుద్ధిని నిలుపు పార్థ!
పిదప నాలోననుందువు ప్రీతితోడ,
ఇందు సందేహమే యుండ దీవు గనుము
శుభములనుపొందగల్గుదు వభయమొదవి.
భావము.
నాలోనే మనసు నిలుపు బుద్ధిని నాలోనే ఉంచు. ఆ తరవాత నాలోనే
నివిసిస్తావు. ఇందులో సందేహం లేదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.