గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

అద్వేష్టా సర్వభూతానాం - ...12 - 13...//.సన్తుష్టః సతతం యోగీ - , , .12 - 14,,,//... శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు ద్వాదశోధ్యాయః - భక్తియోగః

 జైశ్రీరామ్.

 || 12-13 ||

శ్లో.  అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ|

నిర్మమో నిరహఙ్కారః సమదుఃఖసుఖః క్షమీ

తే.గీ.  ద్వేష మెవరిపైనను లేని దీప్త మతియు,

నహమును,మమతను విడిన సహనశీలి 

సమముగా సుఖదుఃఖము ల్సతతముగను,

క్షమను గలిగిన ఘనులెపో ఘనులు భువిని.

భావము.

ఏ ప్రాణాన్ని ద్వేషించని వాడు, అహంకార మమకారాలు లేని వాడు, 

సుఖదుఃఖాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమా గుణం కలవాడు,

 || 12-14 ||

శ్లో.  సన్తుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః|

మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః.

తే.గీ.  నిత్య సంతుష్టుడౌ యోగి, నిగ్రహమతి,

దృఢపు నిశ్చయుండయి నాకు దీపితముగ

మనసు బుద్ధులనర్పించు మహితుడవని

నాకు బ్రియుడర్జునా! కను శ్రీకరముగ.

భావము.

నిత్యము సంతుష్టుడై , యోగియై, మనో నిగ్రహం కలవాడై, దృఢమైన 

నిశ్చయముతో, మనో బుద్ధులను నాకు అర్పించిన నా భక్తుడు 

నాకు ప్రియుడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.