జైశ్రీరామ్
|| 12-9 ||
శ్లో. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనఞ్జయ.
తే.గీ. చిత్తమును నిల్పలేకున్న స్థిరముగాను
పార్థ నాపైన, యోగంబు వరల జేసి
నన్ను బొందగన్ యత్నించు, మన్ననముగ,
శుభము కలుగును నీకిల నభయమిదియె.
భావము.
ధనంజయా స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు
అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు.
|| 12-10 ||
శ్లో. అభ్యాసేప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి.
తే.గీ. చేయ లేకున్న యోగమున్, చేవ జూపి
నా పరంబగు కర్మలన్ నయము దలర
నాచరింపుము శుభములనందుమింక
నీకు జయమగు నర్జునా నీవె కనగ.
భావము.
అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో
నిమగ్నమగుము. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.