గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2022, ఆదివారం

బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణగారికి వాగ్విదాంవర బిరుదు ప్రదానము.

జైశ్రీరామ్. 

బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ మహోదయులు వినయక నవరాత్రులు సందర్భముగా నిన్న(౦౩ - ౯ - ౨౦౨౨న)సిలాపా'స్ ఆఱ్వీ.ధర్మిష్ఠా నివేశ సముదాయ ప్రాంగణమున శ్రీ గణేశ పొజా వైశిష్ఠ్యము అత్యద్భుతముగా ప్రవచించి అందరి మన్ననలు పొందిరి. బ్రహ్మశ్రీ దత్తాత్రేయశర్మ మహోదయులు, శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు,మియాపూర్ మిత్రమండలి సభ్యులు శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారు, శ్రీ మాచవోలు శ్రీధరరావుగారు, వారి శ్రీమతి నాగలక్ష్మి గారు, కవిశ్రీ సత్తిబాబుగారు, శ్రీ సుబ్బారావుగారు ఇంకా అనేక కవిపండితులు,ఇచ్చటనివాసముంటున్న పెద్దలు పరమేశ్వరీ స్వరూపులయిన మహిళామణులు ఈ కార్యక్రమమును తిలకించి చాలా ప్రశంసల వర్షం కురిపించారి ఎందరి ఆమోదంతో మియాపూర్ మిత్రమండలి అనంతకృష్ణ మహోదయులకు *వాగ్విదాంవర* అను బిరుదు ప్రదానముతో ఘనంగా సత్కరించారు.

వాగ్విదాంవర అనంతకృష్ణా జయఘో అనే నినాదాలు మిన్నునంటాయి.
అనంత కృష్ణులు అజాత శతృవగుటకు కారణము వారికి గల వాఙ్నైపుణ్యమే.
కావుననే వీరికి వాగ్విదాంవర అనే బిరుదు ఇచ్చుట సముచితంగా ఉన్నదని సభలోనివారు కొనియాడారు.

జైహింద్.


Print this post

2 comments:

Subbarao Ayyalasomayajula చెప్పారు...

అద్భుతమైన ప్రవచనం

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదాలు సుబ్బారావుగారూ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.