జైశ్రీరామ్.
ఛందస్సు
ఓం శ్రీ గురుభ్యో నమః.
ఆర్యులకు నమస్సులు.
శా. శ్రీలన్ దేల్చు
మనోజ్ఞ భారతిని సచ్చీలంబుతోఁ గొల్చుచున్,
శీలోత్ప్రేరక సత్
కవిత్వ పథమున్ చిత్తంబునం గాంచు, స
చ్చీలోద్భాసిత
సత్కవీంద్ర తతికిన్ చేతున్ ప్రణామంబులన్.
మీలోనొక్కడ నేను
కూడ, కనుదున్
మీతోడ ఛందోద్గతిన్.
మనలో అనేకులకు కవితాసక్తి ఎంతగానో ఉన్న మాట
నిజం. ఐతే వ్రాసే ధైర్యం మాత్రం అంతగా ఉండకపోవచ్చును.
దీనికి అనేకమైన కారణాలు. ముఖ్యంగా మనం ఎంతగా శిక్షణ పొందినప్పటికీ ఇంకా ఏదో లోపం ఉండి
ఉంటుందేమో, దోషాలు ఎక్కడేనా వస్తాయేమోనన్న అనుమానం.
ఈ అనుమానాలు తీరుటకు మనకున్న మార్గం ఛందశ్శాస్త్రం
ఏం చెప్పిందో అది తెలుసులోవడం ఒక్కటే. మనకు సగం ధైర్యం పుంజుకుంటుంది.
నేనైతే ఒక్కటే సూచిస్తాను. మీకు వ్రాయాలనుందా?
వ్రాసేయండి. చూచేవారే మీకు అందులో ఉండే గుణదోషాలను చెప్పుతారు. తద్వారా మీరు సుశిక్షితులౌతారు.
నేను ఛందస్సునకు సంబంధించిన ప్రాథమికాంశాలను
తెలుసుకొనే ప్రయత్నంతో ఉండి, తెలుసుకొన్నవి మీ ముందుంచితే తప్పులుంటే మీరే సూచిస్తారు
కాబట్టి నేను నేర్చుకొనే సదవకాసం కలుగుతుంది. ఒప్పులే ఐతే తెలుసుకొనేవారికి ప్రయోజనకరంగా
ఉంటుంది. ఇంక ఆ జగన్మాత దయ. పచ్చని పద్యాన్ని ప్రేమిద్దాం.
1. శ్రీకారము కృత్యాదిని కలిగినచో దాని ప్రభావము.
క. శ్రీకారము కృత్యాదిని -
బ్రాకటముగనున్నఁ
జాలు - బహుదోషములం
బోకార్చి శుభము లొసఁగును -
బ్రాకృతముగ
నినుముసోఁకు - పరుసము భంగిన్. (సు.ల.సారము 189)
కావ్యాది
వర్ణశుద్ధి
తే. ఆదిపద్యాది శ్రీకారమైన, దేవ - వాచకంబైన నప్పుడు వఱలు
సిరులు
నాది పద్యాది మూఁడు
గణాక్షరములు - చూడవలెఁ గాని యన్నియుఁ జూడవలదు. (సు.ల.సారము 195)
భావము సులభ గ్రాహ్యమే కదా?
2. కృతి రచనకుఁ బ్రశస్త వారములు
గీ. శుక్ర గురు బుధ వారముల్ - సొంపు సేయు - సోమవారంబు సంపదల్ - సొరిది నిచ్చు
శనియు మంగళవారముల్ - చావుదెచ్చు
-
భానువారంబు సంగరం - బమరఁ జేయు. (సు.ల.సారము 269)
భావము. బుధ వారము, గురువారము, శుక్రవారము, కృతి యారంభించిన
గ్రంథముమనోహరంబయి యుండును. సోమవారమునాడు ఆరంభించిన సంపద కలుగును.శనివారము, మంగళ వారము ఆరంభించిన మృతి సంభవము.
ఆది వారము ఆరంభించిన కలహము సంభవించును.
గురులఘువులు.
మాత్రయన
నొక్క లఘువగు ( I ) - మాత్రలు రెండైన గురువు ( U ).
గురు లఘువుల
స్వరూపము
క.
వివిధముగఁ జాఁపి పలికెడు
- నవియును మఱి యూఁదిపలుకు నవియును గురువుల్
భువి
నిలిపి పలుకు వర్ణము - లవియెల్లను
లఘువులయ్యె నంబుధి శయనా! (అనంతుని ఛందము)
వివరణము.
హ్రస్వములు అనగా ఒక్క లిప్త (సెకెను) కాలము
మాత్రము పలుకఁబడే
అ-ఇ-ఉ-ఋ-ఎ-ఒ లు, ఈ అచ్చులతో కూడిన హల్లు వర్ణములు లఘువులు.
అంతకన్న
ఎక్కువ కాలము పలుకఁబడు వర్ణములు గురువులు.
ఆ ఈ ఊ ౠ ఏ ఓ మొదలగునవి.
ఐ.ఔ అనేఅచ్చులు, వీటిమ్ని కలిగి ఉన్న హల్లులు
గురువులు. కైకలో కై గురువు. కౌరవులులో కౌ గురువు.
సున్న, విసర్గలతో కూడిన అచ్చులు హల్లులు గురువులు.
అంకము లో సున్నతో కూడిన అ గురువు
దుఃఖము లో విసర్గముతో కూడియున్న దు అనే అక్షరము గురువు.
ద్విత్వ, సంయుక్త పొల్లు అక్షరములకు ముందున్న
అక్షరములు గురువులు.
అక్కర లో క్క కు ముందున్న అ గురువు.
అక్షరము లో క్షకు ముందున్న
అ గురువు.
అతనిన్ లో న్ అనే పొల్లుకు ముందున్న ని అను అక్షరము గురువు.
అల్పారంభః క్షేమ కరః అని పెద్దల నానుడి. కబట్టి ఇప్పటికి స్వస్తి.
జైహింద్.