గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, డిసెంబర్ 2008, శనివారం

చెప్పుకోండి చూద్దాం?

ఈ క్రింది శ్లోకాన్ని చదవండి.
అందులో మన కొక వస్తువును సూచిస్తున్నాడు.
మనకు చివరికా వస్తువేమిటై యుంటుంది? అనే ప్రశ్న మిగిల్చాడు.
దానిని చదివి అదేమిటై వుంటుందో ఊహించగలరా?
ఊహించ గలిగితే సమాధానాన్ని వీలైతే ఒక చిన్న పద్యంలోను,
కాదనుకుంటే మీకు నచ్చిన విధం గాను
పోష్టే కామెంట్ ద్వారా
పంప గలందులకు మనవి చేయుచున్నాను.

శ్లో:-
వృక్షాగ్ర వాసీ. నచ పక్షి రాజః.
త్రి నేత్ర ధారీ. నచ శూల పాణిః.
చర్మాంగ ధారీ, నచ సోమ యాజీ.
జలంచ ధత్తే, న ఘటో, న మేఘః .

తే:-
వృక్షమునకు పైనుండును. పక్షి కాదు.
తాను ముక్కంటి. మఱి శూల పాణి కాడు.
రాజిత వపు ధారియె. సోమ యాజి కాడు.
జలమొసగు. కాని, ఘట, మేఘములును కావు.

చూచారు కదా? మరి మీ సమాధానలకోసం నేనెదురు చూడనా?
నా ఎదురు చూపు నిరర్థకం కాదనుకొంటాను.

జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

టెంకాయ కరెక్టా అండి

చంద్ర మోహన్ చెప్పారు...

కొబ్బరి కాయ కదా! ఈ శ్లోకం చిన్నప్పుడు చదువుకొన్న జ్ఞాపకం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.