గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, డిసెంబర్ 2008, బుధవారం

సప్తైతే ఋషయస్మృతాః

సప్త ఋషుల పేర్లు:-
మనల నెవరైనా సప్త ఋషుల పేర్లు అడిగినట్లయితే మనం నీళ్ళు నమలక్కరలేదు. ఆ పేర్లు గుర్తుంచుకోడానికో చక్కని శ్లోకముంది. చూద్దామా?
శ్లో:-కశ్యపోzత్రి భరద్వాజో
విశ్వామిత్రోzధ గౌతమః
వశిష్ఠో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయస్మృతాః

తే:-కశ్యపుండత్రి జమదగ్ని గౌతముండు
ఆ వశిష్ఠ భరద్వాజు లనెడువారు
వినుతుడైన విశ్వామిత్రు డనెడు వారు
సప్త ఋషులంచు లోకాన సన్నుతి గనె.

భావము:-"కశ్యపుడు - అత్రి - భరద్వాజడు - విశ్వామిత్రుడు - గౌతముడు - వశిష్టుడు - జమదగ్ని" అనబడే ఏడుగురూ సప్త ఋషులుగా ప్రసిద్ధి పొందిరి.
చూచారు కదా ఈ శ్లోకం. కంఠస్థం చేయాడానికి పెద్ద కష్ఠపడిపోయే పనిలేదు కదా. ఎందుకాలస్యం ? కంఠస్థం చేసెద్దాం. మీరేమంటారు?
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.