దయా స్వభావము యొక్క గొప్పతనము.
భక్తి భావంతో ముక్తి మార్గాన్ని వెదకుకొంటూ అనేక పూజాదికాలు చేసేవాళ్ళం మనలో చాలామందే వుంటాము. ముక్తి కోరే స్వభావం ఉన్నట్టయితే దాని కొఱకు మనం వెంపర్లాడే పని లేదు. దయా స్వభావం ఉంటే చాలు. ఈ విషయంలో ఒక చక్కని శ్లోకముంది. చూడండి.
శ్లో:-యస్య చిత్తం ద్రవీభూతం
కృపయా సర్వ జంతుషు
తస్య జ్ఞానేన మోక్షేణ
కిం జటా భస్మ లేపనైః
ఆ:-ప్రాణి కోటిని తన ప్రాణ మట్టుల జూచి,
జాలి నొందు వాని జన్మ జన్మ.
భక్తి తోడ తపము, భస్మానులేపంబు
లేల? ముక్తి గొలుప, జాలి చాలు.
Print this post

భావము:-దయార్ద్ర హృదయ మున్నచో ముక్తి కొఱకై జప తపాదులు, విభూతి లేపనములు, జడలు కట్టేంతటి కఠోర తపములతో పని లేదు. ఆ అన్నింటినీ మించినది దయ. ఎవరు దయార్ద్ర హృదయులై బ్రతికున్నంత కాలమూ ప్రాణి కోటిపై దయకలిగి ప్రవర్తిస్తారో వారికి ముక్తి సుకరముగ లభించును.
మనలో అంతర్గతంగా ఉండే దయా స్వభావాన్ని వెలికి తీద్దామా మఱి?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.