గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2008, ఆదివారం

చోరోపమః సత్ కవిః

మన తెలుగు కవుల, సంస్కృత కవుల రచనా చమత్కారం హృదయానంద జనకంగా వుంటుంది. ఈ భరత భూమి ఎంతటి మహనీయులకాలవాలమో కదా! అట్టి మహనీయుల చమత్కార రచనలు మన మనస్సును ఆకట్టుకొనక మానవు. చూడండీ క్రింది శ్లోకాన్ని.

శ్లోకము:-
మందం నిక్షిపతే పదాని . పరితః శబ్దం సముద్దీక్ష్యతే.
నానార్థా హరణం చ కాంక్షతి . ముదాలంకార మాకర్షతి.
ఆదత్తే సకలం సువర్ణ నిచయం. ధత్తే రసాంతర్గతం.
దోషాన్వేషణ తత్పరో విజయతే చోరోపమః సత్ కవిః.

ఈ శ్లోకంలోని రసాస్వాదన చేయలేనివారెవరుంటారు? {నేనుతప్ప.}

మీరూ పఠించారు కదా! దీనిలో గల చమత్కారాన్ని పద్య రూపంలో గాని, గద్య రూపంలో గాని మీరు " పోష్టే కామెంట్" ద్వారా నా బ్లాగుకు పంపిన వారైతే అది చదివే భాగ్యాన్ని అనేక మందికి కలిగించినవారౌతారు. ఇందు నిమిత్తము ముందుగా మీకు నా ధన్య వాదములు. మరి మీ స్పందనకై యెదురు చూడనా?
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.