గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, డిసెంబర్ 2008, బుధవారం

కామం కర్ణాంత విశ్రాంతే. మేలిమి బంగారం మన సంస్కృతి 30

కావ్యార్థ దర్శనము యొక్క ఆవశ్యకత.
శాస్త్ర పఠనా పరిజ్ఞాన ఆవశ్యకతను ఒక శ్లోకములో చక్కగావివరింప బడింది. చూద్దామా?
శ్లో:- కామం కర్ణాంత విశ్రాంతే
విశాలే తస్య లోచనే
చక్షుష్మత్తాతు శాస్త్రేణ
సూక్ష్మ కార్యార్థ దర్శినా.

క:- కను లాకర్ణాంతము గని
కను లను టది తగదు. నిజము. కావ్యార్థంబుల్
కనుగొని సూక్ష్మ జ్ఞానము
కనిపింపగ తెలుపువాని కన్నులు కన్నుల్.

భావము:- విశాలమైన నేత్రాలతో లోకాన్నయితే చూడగలంగాని, సూక్ష్మ దృష్టి గలిగి నప్పుడు మాత్రమే కావ్యార్థాల్నీ, అందులోని సూక్ష్మ కార్యార్థ దర్శనములను వివరింప గల సూక్ష్మాంశాల్నీ చూచి చెప్పగలగడానికి సాధ్యమౌతుంది.
మనమూ కావ్య పఠనము చే యు సమయంలో అందలి సూక్ష్మ మైన అంశాల్ని కూడా గ్రహించ గలిగితే ప్రయోజన కరంగా ఉంటుంది. తప్పక అలాగే చేద్దామా?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.