తల్లి సంస్కృతంబె ఎల్లరకును అనే నానుడి మనకు తెలియనిదికాదు. అలాంటి సంస్కృత భాషలో వెలకు వేలుగా అద్భుతమైన శ్లోకాలున్నయి. వాటిలో మన మనసునాకట్టుకొనె వనేకమున్నాయి అందులో ఒక తమాషా శ్లొకం మీముందుంచుతున్నాను.
శ్లోకము:-
రావణస్య కియద్ వక్ర్తం?
నూపురః కుత్ర వర్తతే?
ఆంధ్ర గీర్వాణ భాషాయాం
ఏకమేవోత్తరం దదా.
ఈ శ్లోకంలో ఒకే పదం రెండు ప్రశ్నలకీ సమాధానంగా రావాలట.
రావణునకుగల శిరసులెన్ని?
అందెలు ఎక్కడ వుండును.?
దీనికి సమాధానం పది.
1. పది = రావణుని సిరములు పది.
2. పది. =నూపురము ఉండు చోటు పది. = పదములందు అని అర్థము.
ఒకే పదం రెండు ప్రశ్నలకీ సమాధానంగా వచ్చి తమాషాగా వుందికదూ? మరొక పర్యాయం మరొక శ్లోకం చెప్పుకుందాం.
జైహింద్.
Print this post
(ఆ)కలి కాలము ... సంగమేశ్వర త్రిశతి. రచన :-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
జుత్తాడ,
-
(ఆ)కలి కాలము
షోడశోత్తర సంగమేశ త్రిశతి
1.సి:-శ్రీరాము...
1 వారం క్రితం
వ్రాసినది












1 comments:
దీని సమాధానం "పదే" అనుకున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.