లోభము - దానివలన కలిగే అనర్థము.
మానవుడు ఎంత విజ్ఞాని అయినప్పటికీ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములు అనే అరిషట్ వర్గాలకీ లోనవుతున్నాడు. అందునా లోభత్వం వల్ల నానా యాతనలూ అనుభవిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఒక శ్లోకాన్నిప్పుడు చూద్దాం.
శ్లో:-సుమహాంత్యపి శాస్త్రాణి
ధారయంతే బహు శ్రుతాః
భేత్తారః సంశయానాంచ
క్లిశ్యంతే లోభ మోహితః
తే:-గొప్ప, గొప్పగు షట్ శాస్త్ర్ర్ర కోవిదులును,
శృతుల నెన్నుచు, బహు ధర్మ గతులు చెప్పు
స్థుత మతులు, లోభ కలుషిత మతిని, సతము
దుస్థితిని పొంది, కష్ఠాల తోగు చుండు.
Print this post

భావము:-చక్కని శాస్త్ర పరిజ్ఞానము కలిగియుండియు, వేద పరిజ్ఞానమును కలిగి యుండియు, ధర్మ సందేహములను నివృత్తి చేయగలిగి యుండియు, వారిలో లోభ గుణము కలిగియుండు వారు దుస్థితిని పొంది, నానా యాతనలకు గురి అవుతూ వుంటారు కదా!
ఇంత అనర్ధదాయకమైన లోభాన్ని విడనాడితే చాలు ఆశాస్త్ర పరిజ్ఞానం పరిమళించడమే కాక, మనసు హాయిగా వుండి, పలువురికి ఆదర్శవంతంగా బ్రతక వచ్చు కదా. అందుకనే మనకు నష్టదాయకమైన లోభాన్ని మనమూ విడనాడుదాం. మీరేమంటారు?
ఇంత అనర్ధదాయకమైన లోభాన్ని విడనాడితే చాలు ఆశాస్త్ర పరిజ్ఞానం పరిమళించడమే కాక, మనసు హాయిగా వుండి, పలువురికి ఆదర్శవంతంగా బ్రతక వచ్చు కదా. అందుకనే మనకు నష్టదాయకమైన లోభాన్ని మనమూ విడనాడుదాం. మీరేమంటారు?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.